- Advertisement -
ప్రస్తుతం టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఆనందంలో మునిగితేలుతున్నాడు. హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్ రెండు రోజుల క్రితం పండండి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బాబు ఫేస్ కనిపించకుండా చేయి పట్టుకొని దిగిన ఫోటోను పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. శనివారం తన కొడుకొని అభిమానులకు పరిచయం చేశాడు. తన కొడుకుని ఎత్తుకుని చూస్తూ మురిసిపోతున్న ఫోటోలను పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోను చూసిన అభిమానులు జూనియర్ పాండ్యా చాలా క్యూట్ గా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
The blessing from God 🙏🏾❤️ pic.twitter.com/xqcmbVIUIr
— hardik pandya (@hardikpandya7) August 1, 2020
Hardik Pandya Share his Son Photo
- Advertisement -