Wednesday, May 1, 2024

భారీ పేలుడుకు దద్దరిల్లిన లెబనాన్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

At least 78 dead and 4000 wounded Beirut explosion

బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లోని నౌకశ్రయం దగ్గర రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. పోర్టులో అమ్మోనియం నైట్రేట్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల అనేక దుకాణాలు, ఇళ్ల పైకప్పులు, ఇతర నిర్మాణాలు, భవనాలు గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్నాయి. ఆరేళ్లుగా అత్యంత శక్తివంతమైన అమ్మోనియ పదార్ధాల నిల్వ ఉంచినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 2,750టన్నుల అమ్మోనియం పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బీరూట్ లో భయానక వాతావరణం నెలకొంది. 240 కిలో మీటర్లు అవతల దీవికి పేలుడు శబ్దం వినిపించింది. ఈ భారీ పేలుడులో మృతుల సంఖ్య 78 చేరగా.. ఇప్పటివరకు దాదాపు 4వేల మందిపైగా గాయాపడ్డారు. ఈ ప్రమాదఘటనతో లెబవాన్ అధ్యక్షుడు మూడురోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. పేలుళ్ల ధాటికి బీరూట్ నగరమంతా ప్రకంపనులు సంభవించాయి. లెబనాన్ ప్రజలు కోలుకోవాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. బీరూట్ పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తిం చేశారు. ప్రాణ, ఆస్తినష్టం జరగడంపై ప్రధాని విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News