Tuesday, May 7, 2024

ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాక్..

- Advertisement -
- Advertisement -

Ireland defeated England by 7 wickets

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఆఖరి వన్డేలో ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసక శతకంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్ 84 బంతుల్లోనే 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఒక దశలో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మోర్గాన్ అండగా నిలిచాడు. అతనికి టామ్ బాంటమ్(51) అండగా నిలిచాడు. చివర్లో విల్లే(51), శామ్ కరన్ 38(నాటౌట్) రాణించడంతో ఇంగ్లండ్ మెరుగైన స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ మరో బంతి మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్ పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బాల్‌బ్రయిన్‌లు శతకాలతో చెలరేగడంతో ఐర్లాండ్ భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. స్టిర్లింగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. మరోవైపు కెప్టెన్ బార్ల్‌బ్రయిన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు చెలరేగి పోవడంతో ఐర్లాండ్ అలవోకగా లక్షాన్ని అందుకుంది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన స్టిర్లింగ్ 128 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 9 బౌండరీలతో 142 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఆండ్రూ 12 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. ఇద్దరు సెంచరీలతో రాణించడంతో ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఇంగ్లండ్ ముందే సిరీస్‌ను దక్కించుకుంది.

Ireland defeated England by 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News