Tuesday, May 7, 2024

ట్రంప్ పోస్టును దెలిట్ చేసిన ఫేస్‌బుక్

- Advertisement -
- Advertisement -

ట్రంప్ పోస్టును దెలిట్ చేసిన ఫేస్‌బుక్
పిల్లల్లో ఇమ్యూనిటీపై ట్రంప్ వీడియో తొలగింపు

Facebook remove Donald Trump Post over Coronavirus

హూస్టన్: మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోస్టును ఫేస్‌బుక్ తొలగించింది. కరోనా వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి చిన్న పిల్లల్లో ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఫేస్ బుక్ తొలగించింది. కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తమ విధానం కాదని, అందుకే ఈ పోస్టును తొలగిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధి యాండీ స్టోన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాక్స న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లల్లో కరోనా వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియోను ట్రంప్ ప్రచార యంత్రాంగం ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. కాగా, కొవిడ్-19ను తట్టుకునే రోగ నిరోధక శక్తి కొంతమందికి ఉందంటూ తప్పుడు వాదనలతో కూడిన ఈ వీడియో కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదన్న తమ విధానాలను ఉల్లంఘిస్తోందని యాండీ స్టోన్ తెలిపారు.

కాగా, అమెరికా అధ్యక్షుడి పోస్టును ఫేస్‌బుక్ పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి. దీంతో అమెరికా అధ్యక్షుడి పోస్టులను సెన్సార్ చేయగల అధికారం తమకు ఉందని ఫేస్‌బుక్ నిరూపించుకున్నట్లయింది. ఇదే వీడియోకు సంబంధించి టీమ్ ట్రంప్ షేర్ లింకును ట్విటర్ కూడా బుధవారం తొలగించింది. టిటర్ నిబంధలను ఉల్లంఘించిన ఈ లింకు అందుబాటులో లేదని ఈ లింకులపై క్లిక్ చేసిన ట్విటర్ యూజర్లకు మెసేజ్ లభిస్తోంది.
ఇదిలా ఉండగా, తమ పోస్టును తొలగించిన ఫేస్‌బుక్‌పై ట్రంప్ మీడియా ప్రచార యంత్రాంగం మండిపడింది. ఫేస్‌బుక్ ఘోర వివక్షకు పాల్పడుతోందని ఆరోపించింది. కరోనా వైరస్ బారిన పడే అవకాశం పిల్లలకు లేదన్న వాస్తవాన్ని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారని ట్రంప్ ప్రచార డిప్యుటీ జాతీయ ప్రెస్ కార్యదర్శి కర్టీ పరెల్లా ఒక ఇమెయిల్ ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా కంపెనీలు అమెరికా అధ్యక్షుడిపై వివక్షతతో వ్యవహరిస్తున్నాయని పరెల్లా ఆరోపించారు.

Facebook remove Donald Trump Post over Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News