హైదరాబాద్: అనుమతి లేకుండా అపార్ట్మెంట్లోకి ప్రవేశించవద్దన్నందుకు సెక్యూరిటీ గార్డ్ పై ఓ మహిళ దాడి చేసిన సంఘటన నగరంలోని చందానగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. చందానగర్‌లోని శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో, ఫ్లాట్ యజమానుల సూచన మేరకు సదురు మహిళను సెక్యూరిటీ లోనికి ప్రవేశించవద్దని చెప్పాడు. దీంతో ఆమె ఆగ్రహంతో కారులోంచి దిగి వాచ్‌మ్యాన్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అంతటితో ఆగకుండా కాలితో తన్నింది. మహిళ వాచ్‌మ్యాన్‌పై దాడి చేసిన ఘటన సిసిటివి ఫుటేజీలో రికార్డు అయింది. దీంతో వాచ్‌మ్యాన్, ఆమెపై చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫ్లాట్ యజమానుల సూచన మేరకే ఆమెను అపార్ట్మెంట్ లోపలికి అనుమతించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ కోసం గాలిస్తున్నారు.
Woman Beat Watchman at chandanagar
#WATCH Telangana: A woman thrashed a watchman after an alleged argument took place between them in Chandarnagar, Hyderabad on August 24.
Local police say that they have received a complaint from the watchman & after obtaining permission from the court, they will register a case. pic.twitter.com/LuYefrJzVV— ANI (@ANI) August 26, 2020