Tuesday, April 30, 2024

కోవిడ్ నిబంధనల మేరకే మెట్రో ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Metro travel according to Covid-19 rules

హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టేందుకు అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మెట్రో అధికారులు ఆదిశగా చర్యలు వేగం చేశారు. ముందుగా 7వ తేదీన ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లో నడిపేందుకు సిద్దం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి 57 మెట్రో స్టేషన్ల క్లీనింగ్, శానిటైషన్ పనులు చేపడుతున్నారు. కరోనా నిబంధనలకు అనుసరిస్తూ ఒక రైలులో 100 నుంచి 125సీట్లు ఉండగా, అందులో మూడో వంతు మందిని మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అదే విధంగా 10సంవత్సరాల లోపు పిల్లలు, 65 ఏళ్ల వృద్దులకు ప్రవేశం నిషేదించారు. అన్నిమెట్రో స్టేషన్లలో లిప్ట్‌లు బంద్, స్మార్ట్‌కార్డు, నగదు రహిత డిజిటల్ టికెట్ల విక్రయం ఉంటుందని పేర్కొన్నారు.

మెట్రో స్టేషన్లతో పాటు రైళ్ల బౌతికదూరంగా పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు, సీసీటివి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రయాణికులు మాస్కులను ధరించాలని, లేకుంటే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ప్రయాణికులు నిలబడేందుకు, కూర్చునేందుకు మార్కింగ్‌లు వేస్తున్నారు. ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులు తమ వెంట తక్కువ సామాగ్రి తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

అదే విధంగా కంటైన్‌మెంట్ జోన్ల ఉన్న స్టేషన్లు మూసివేయాలని కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ గాంధీ ఆసుపత్రి, భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుప్‌గూడ స్టేషన్ల మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రైళ్ల వేళలో మార్పులు చేసినట్లు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటలవరకు రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మొదటి రోజు ఎల్బీనగర్, మియాపూర్ కారిడార్, ఈనెల 8వ తేదీన కారిడార్ మూడు నాగోల్ నుంచి రాయదుర్గం, ఈనెల 9న 2,3 కారిడార్ల పూర్తి స్దాయిలో నడుస్తాయని, ప్రతి 5 నిమిషాలకు ఒకటి రైళ్లు ఉంటుందని వెల్లడించారు.ప్రయాణికులు మెట్రో అధికారుల సూచనలు పాటిస్తూ తమ గమ్యస్దానాలకు ప్రయాణించాలని, కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెట్రో అధికారులు కోరుతున్నారు.

Metro travel according to Covid-19 rules

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News