Wednesday, May 1, 2024

ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపులు..

- Advertisement -
- Advertisement -

Eiffel Tower Evacuated after Bomb threats

పారిస్: బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఇక్కడి ప్రఖ్యాత ఈఫిల్ టవర్ చుట్టూ భద్రతను విస్తృతపర్చారు. అక్కడికి వెళ్లే మార్గాలను దిగ్బంధించారు. ఓ వ్యక్తి అధికారులకు ఫోన్ చేసి టవర్స్‌ను పేల్చివేస్తున్నట్లు తెలిపారు. దీనితో ఇక్కడ భద్రతను ముమ్మరం చేసినట్లు విధులలో ఉన్న పోలీసు అధికారులు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు చెప్పారు. టవర్ సమీపంలోని వీధులలో పెద్ద ఎత్తున పోలీసు కార్లు మొహరించారు. ఈఫిల్ టవర్‌కు దారితీసే మార్గాలలో బారికేడ్లు పెట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితిపై స్పందించేందుకు ఈఫిల్ టవర్స్ నిర్వహణాధికారులు నిరాకరించారు. కరోనా కన్నా ముందు ఈ ప్రపంచ ప్రఖ్యాత టవర్ సందర్శనకు ప్రతి రోజూ సగటున పాతికవేల మంది వస్తూ ఉండేవారు. అయితే ఈ 131 ఏండ్ల అత్యద్భుత కట్టడ వీక్షణకు ఇప్పుడు ప్రయాణ ఆంక్షలు, భౌతిక దూరాల పాటింపుల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Eiffel Tower Evacuated after Bomb threats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News