Sunday, May 19, 2024

ఇక.. వేధింపులపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

Strict action against those who harass Women

 

అడిషనల్ డిజిపి స్వాతి లక్రా

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలను వేధించినా, సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేసిన వారిని ఇక సహించేది లేదని, వారిపై ఉక్కుపాదం మోపడం ఖాయమని ఎడిజిపి స్వాతిలక్రా పేర్కొన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన 200 మందికి బుధవారం నాడు మహిళా భద్రత విభాగం ప్రధానకార్యాలయం నుండి ఎడిజిపి స్వాతిలక్రా ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజిపి స్వాతి లక్రా మాట్లాడుతూ మహిళలను వేధింపులకు గురిచేసే వారు ఇక మీదట జాగ్రత్తగా మసలుకోవాలని, ఏదైనా పోలీసులు కొంత మేరకే భరించగలరని హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలను వేధించేవారిలో మార్పు తీసుకురావటానికి ఆన్ లైన్ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో బాధ్యుల తల్లిదండ్రులు హాజరు కావటంతో వారికి కూడా పలు సూచనలు చేశారు.

పిల్లలప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, బాధ్యులు ఒకటి గుర్తెరగాలని మీరు చేసిన తప్పిదాలే రేపు మీ కుటుంబంలోని మహిళలకు కూడా వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందని హెచ్చరించారు. సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలని కోరారు. మార్పు మీ నుండే మొదలుకావాలని కోరారు. అనంతరం మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి మాట్లాడుతూ మహిళలను వేధించేవారిని ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని, వేధింపులకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని చిన్నపాటి తప్పులకు పాల్పడిన వ్యక్తులకు హెచ్చరికలు చేసి మార్చగలుతున్నాన్నారు. ఇందుకు అన్ని జిల్లా లషీ టీమ్ లు చేస్తు న్నకృషి మరువలేదని చెప్పారు. ప్రతి జిల్లా షీ టీమ్ మహిళల సమస్యల పట్ల చాలా వేగంగా స్పందిస్తున్నారని ఇదే కొనసాగించాలని అన్నారు.

ఈ కౌన్సెలింగ్ లో ప్రముఖ సైకాజిస్టులు మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రముఖ విద్యావేత్త, ఫ్లేమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఇందిరా పారిఖ్ పాల్గొని బాధ్యుల్లో మార్పునకు కొన్ని సూత్రాలు చెప్పారు. అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతాచల్ల పాల్గొని బాధ్యులతో కొన్ని ప్రయోగాత్మక విధానాలను అవలంభిస్తూ వారి తప్పును తెలుసుకొని వారిలో మార్పు వచ్చేలా చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు తమలో మార్పు వచ్చిందని తమ తమ జిల్లా షీ టీమ్ లు తమ పరివర్తన దిశగా ఎంతో ప్రయత్నం చేశాయని ఇక మీదట ఇలాంటి తప్పిదాలకు పాల్పడబోమని చెప్పటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News