Sunday, May 5, 2024

తారక్ సిక్స్‌ ప్యాక్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తన ఫిట్‌నెస్ పట్ల తారక్ చూపించే అంకితభావం నిజంగా అద్భుతం. తన సినిమా కోసం ఎంతవరకు అయినా వెళ్లగలడు అని తన స్టన్నింగ్ లుక్స్‌తో చాలా సినిమాల్లో అబ్బురపరిచాడు. ముఖ్యంగా తారక్ తన గత చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’లో సిక్స్‌ప్యాక్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆ లుక్‌కు సంబంధించి అప్పట్లో కొన్ని ఫొటోలు వచ్చాయి. అయితే ఇప్పుడు సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తన కెరీర్ ప్రారంభించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా గతంలో తాను తీసిన ప్రముఖల ఫొటోలను ఆదివా రం షేర్ చేశాడు. ఈ క్రమ ంలో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న అరుదైన చిత్రాన్ని ట్విట్ట ర్ వేదికగా పంచుకున్నాడు. ‘అరవింద సమేత’ కోసం తారక్ ఇలా సిక్స్‌ప్యాక్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం లో నటిస్తున్నాడు.

Jr NTR Six Pack look goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News