Home తాజా వార్తలు అరుదైన మైలురాయిని చేరుకున్న రష్మిక

అరుదైన మైలురాయిని చేరుకున్న రష్మిక

ఛలో, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన బ్యూటీ రష్మిక మందన్న. ఈ భామ ప్రస్తుతం అల్లుఅర్జున్ మూవీ ‘పుష్ప’తో పాన్ ఇండియా క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో అరుదైన మైలురాయిని చేరుకుంది. అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్న కోటి మంది ఫాలోవర్స్ సంఖ్యను రష్మిక చేరుకుంది. సౌత్ లో హీరోయిన్స్‌గా చాలా కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన వారు మాత్రమే 10 మిలియన్ ల మార్క్ ను క్రాస్ చేశారు. కానీ రష్మిక మాత్రం చాలా తక్కువ సమయంలోనే ఇన్‌స్టాలో పది మిలియన్‌ల మంది ఫాలోవర్స్‌ని వెనకేసుకోవడం ఆశ్చర్యకరం. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. అందుకే అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తున్నారు. దీంతో ఆమెకు ఈ స్థాయి ఫాలోవర్స్ దక్కారు.

Rashmika Mandanna On Reaching 10 M Followers

Rashmika Mandanna Reaches 10 Million followers on Instagram