Saturday, May 4, 2024

పెళ్లి కోసమే మతం మార్పిడి ఆమోదనీయం కాదు: అలహాబాద్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Conversion just for marriage’s sake not acceptable

 

అలహాబాద్ : యుపిలోని అలహాబాద్ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకోవడానికి మాత్రమే మతం మారడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. నవ దంపతుల్లో వధువు పుట్టుకతో ముస్లిం అని, పెళ్లి కోసం మాత్రమే ఓ నెల క్రితం హిందూ మతంలోకి మారారని, ఇది సరికాదని తెలిపింది. పోలీసు రక్షణ కోసం నవ దంపతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠీ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.  జస్టిస్ త్రిపాఠీ ఈ సందర్భంగా 2014లో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఆ కేసులో వధువు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకున్నారని తెలిపారు. ముస్లిం యువకుడు చెప్పిన మీదట హిందూ యువతి ఇస్లాం గురించి ఎటువంటి పరిజ్ఞానం లేకుండా, ఇస్లాం మీద నమ్మకం లేకుండా, కేవలం పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడం చెల్లుతుందా? అని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. వీరు రక్షణ కోసం దాఖలు చేసిన రిట్ పిటిషన్లను తోసిపుచ్చిందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News