Wednesday, May 15, 2024

ఆ నిబంధన తప్పనిసరి చేయాలి: సచిన్ టెండూల్కర్

- Advertisement -
- Advertisement -

ముంబై: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ హెల్మెట్ వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయాల్సిందేనని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐసిసికి సూచించాడు.ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు హెల్మెట్‌ను ఉపయోగించడంలో నిర్లక్షం కనబరుస్తున్నారని సచిన్ ఆందోళన వ్యక్తం చేశాడు. గతంతో పోల్చితే ప్రస్తుతం బౌలర్లు మరింత వేగంగా బంతులు విసురు తున్నారని, ఇలాంటి స్థితిలో హెల్మెట్ ధరించి బ్యాటింగ్ చేయడమే మంచిదన్నాడు. యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో చాలా మంది క్రికెటర్లు హెల్మెట్ ధరించ కుండానే బ్యాటింగ్‌ను చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నాడు. రిషబ్ పంత్, విజయ్ శంకర్ తదితరులకు అయిన గాయాలే దీనికి నిదర్శనమన్నాడు. మరోవైపు క్రికెటర్ల ప్రాణాలను కాపాడాలంటే హెల్మెట్ నిబంధనను కచ్చితం చేయాల్సిందేనని సచిన్ స్పష్టం చేశాడు.

Sachin Tendulkar urges ICC to wearing helmets mandatory

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News