Sunday, May 5, 2024

అమెరికా ఓటర్లకు ట్రంప్, బిడెన్ చివరి అభ్యర్థనలు

- Advertisement -
- Advertisement -

Trump, Biden last requests to American voters

 

ఘాటైన , వైరుధ్య ధోరణిలో ప్రచారం ముగింపు

వాషింగ్టన్ : రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ మంగళవారం ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా చివరి విజ్ఞప్తులు చేస్తూ తమ వైరుధ్య, ఘాటైన ప్రచారాన్ని ముగించారు. దేశాన్ని పీడిస్తున్న అనేక సమస్యల సంక్షోభం నుంచి విముక్తి కలిగిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇటీవలి అమెరికా చరిత్రలో నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలు చాలా వైరుధ్య ఎన్నికలుగా చరిత్రకెక్కాయి. ఇప్పటికే ఈ ఎన్నికలు అనేక గణనీయ మార్పులతో రికార్డు సాధించాయి. దేశ భవిష్యత్తుకు సంబంధించి అనుసరించవలసిన మార్గంలో అభ్యర్థులిద్దరూ ఏమాత్రం విరుద్ధంగా లేరు. కీలకమైన పోటీ ప్రాంతాలైన విస్కన్సిన్,మిచిగన్, ఉత్తర కెరోలినా, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ సోమవారం ప్రచారం సాగించగా, అతని ప్రత్యర్థి పెన్సిల్వేనియా, ఒహియోల్లో ప్రచారం సాగించారు. శ్వేతసౌధానికి తమను తిరిగి పంపాల్సిందిగా ఓటర్లను వారు అభ్యర్థించారు.

తన మద్దతుదార్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ట్రంప్ తెలియచేస్తూ మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ వారిగా పరిగణించలేను, మీ ఆశలు, నా ఆశలు, మీస్వప్నాలు నా స్వప్నాలు , రోజూ తాను పోరాడుతున్నదీ మీ భవిష్యత్తు కోసమేనని ట్రంప్ ఓటర్లను అభ్యర్థించారు. ఈమేరకు గత అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు. నిద్రపోతున్న జో బిడెన్‌కు ఓటేస్తే ప్రపంచ వాదులకు, కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు, ఉదారవాద సంపన్న వర్గాలకు ప్రభుత్వాన్ని అప్పగించినట్టే అవుతుందని బిడెన్‌పై మాటల దాడి చేస్తూ మరో ట్విట్టర్ ద్వారా ఓటర్లకు సూచించారు. రిపబ్లికన్ పార్టీ తన ప్రచారంలో అమెరికాను మరోసారి వైభవోపేతంగా తీర్చిదిద్దుదాం. తిరిగి తమ అద్భుతమైన అధ్యక్షుడ్ని ఎన్నుకోండి అని ఓటర్లకు ట్వీట్ చేసింది. నాలుగేళ్ల క్రితం చరిత్ర సృష్టించాం. రేపు తిరిగి చరిత్ర సృష్టించబోతున్నాం అని అధికార పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. మాజీ ఉపాధ్యక్షుడైన బిడెన్ డెమోక్రాట్ అభ్యర్థిగా తాను గర్వపడుతున్నానని, అమెరికా అధ్యక్షుడిగా దేశాన్ని పాలిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

తనకు మద్దతు ఇచ్చినా ఇవ్వక పోయినా వారి కోసం డెమోక్రాట్స్, రిపబ్లికన్లతో కలసి పనిచేస్తానని సూచించారు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో కరోనా మహమ్మారి వల్ల 2,30,000 మంది అమెరికన్లు మృతి చెందారని, 30 మిలియన్ మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని, ప్రతి ఐదు వ్యాపార సంస్థల్లో ఒకటి మూతపడిందని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల క్రితం కన్నా బాగా ఉండాలని కోరుకోవడం లేదా అని బిడెన్ ఓటర్లను ప్రశ్నించారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకుంటే కనీస సౌకర్యాలు, వనరులను పునరుద్ధరిస్తానని, వాతావరణ మార్పులను నివారిస్తానని, మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, తిరిగి వెనుకటిలా పునర్నిర్మాణానికి ఇది మంచి తరుణమని బిడెన్ ఓటర్లను కోరారు. జాతీయ సర్వేలు బిడెన్ ఆధిక్యతలో ఉన్నారని వెల్లడించగా, కొద్ది రాష్ట్రాల్లో ఆధిక్యత చాలా స్వల్పంగా ఉందని, అదే ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News