Friday, May 10, 2024

తొమ్మిది మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Fire broke out at Clothing store in Ahmedabad and 9 dead

 

ఆహ్మదాబాద్‌లోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

ఆహ్మదాబాద్ : గుజరాత్‌లోని ఒక బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9మంది సజీవ దహనం అయ్యారు. అహ్మదాబాద్ నానుకాకా ఎస్టేట్‌లోని పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో బుధవారం ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఈ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు, పేలుడు కారణంగానే భవనం కూలిపోయిందని అగ్నిమాపక అధికారిజయేష్ ఖాడియా తెలిపారు.ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని శిథిలాల నుండి బయటకు తీసి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News