Monday, May 20, 2024

నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

- Advertisement -
- Advertisement -
Cold Intensity Increasing in Hyderabad
తగ్గుతున్న విద్యుత్ డిమాండ్ 

హైదరాబాద్: నిన్న మొన్నటి దాక ఏసీలు, కూలర్లు,ఫ్యాన్లు 24 గంటల పాటు తిరగడంతో విద్యుత్ డిమాండ్ అధికం అయ్యింది. పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, గృహాలకు పెద్ద మెత్తంలో కరెంట్ బిల్లు రావడంతో ఆ బిల్లు చూడగాని వారి గుండె ఆగినంత పని అయ్యేది. అయినా అధిక ఉష్ణోగ్రతల నుంచి తట్టకునేందుకు పెద్ద మొత్తంలో వచ్చి విద్యుత్ బిల్లును తప్పని పరిస్థితుల్లో భరించాల్సి వచ్చేది. కాని ప్రస్తుత చలికాంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలిపెరగడంతో ఒక్క సారిగా విద్యుత్ డిమాండ్ తగ్గింది.దాంతో పాటు విద్యుత్ వినియోగ దారుల బిల్లుల భారం కూడా తగ్గింది. చలీ తీవ్రత పెరిగిన నేపథ్యంలో గ్రేటర్‌లోని విద్యుత్ డిమాండ్‌లో భారీ మార్పులు వచ్చాయి.

గ్రేటర్ సాధారణంగా 2000 నుంచి 2200 యూనిట్ల మెగవాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోంది. రాత్రి వేళల్లో మాత్రం విద్యుత్ డిమాండ్ మరింత తగ్గి 1000 నుంచి 1350 మెగావాట్లు మాత్రమే నమోదు అవుతుండగా,మధ్యాహ్న సమయంలో విద్యుత్ డిమాండ్ 1800 నుంచి 2000 మెగావాట్లు నమోదు అవుతోంది. గత వారం రోజులుగా చలి త్రీవత పెరగడంతో రాత్రి సమయాల్లో ఏసీలు,ఫ్యాన్లు, కూలర్ల వాడకం కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. నంబర్ నెలలోనే ఈ పరిస్థితి ఉంటే కొద్ది రోజులలో డిసెంబర్, జనవరిలలో చలి తీవ్రత అధికం అవుతుందని దాంతో పాటు విద్యుత్ డిమాండ్ సాధ్యమైనంత తగ్గడమే కాకుండా వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని ప్రజలు సంతోషించినా వేసివి కాలం మాత్రం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సమానంగా విద్యుత్ డిమాండ్ తద్వారా వినియోగ దారులు విద్యుత్ బిల్లుల భారం భరించక తప్పదు.

తగ్గుతున్న విద్యుత్ డిమాండ్ వివరాలు మిలియన్ యూనిట్లు ( ఎంయు)లలో ఈ క్రింది విధంగా ఉంది.

 

Cold Intensity Increasing in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News