- Advertisement -
అమరావతి: భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని పట్నంబజారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎటి ఆగ్రహారం ప్రాంతంలో ఓ దంపతులు నివసిస్తున్నారు. భర్త ఏ పని చేయకుండా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. భార్య నగ్న వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దీంతో భార్య పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. అప్లోడ్ చేసిన వీడియోలను ఐటి పోలీస్ అధికారులు డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా అప్లోడ్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Advertisement -