Saturday, May 4, 2024

సూర్యాపేటలో ప్రేమజంట ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide in Suryapet

సూర్యాపేట: ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చందు పట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్(21), ఓ యువతి సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు పెళ్లి విషయం చెప్పడంతో వారు అంగీకరించలేదు. బతికుండగా కలిసి ఉండలేమని గ్రహించిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రేమ జంట మొద్దుల చెరువు గ్రామ శివారులోకి వచ్చి చెట్టుకు ఉరేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News