Monday, May 6, 2024

వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…

- Advertisement -
- Advertisement -

150.05 acres of land Acquisition for Wagon Factory

వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపి దయాకర్, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఉన్నారు.

సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కృషితోనే కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని కానీ కేంద్ర నిర్లక్ష్యం చేస్తోందని ఎంపి  పసునూరి దయాకర్ మండిపడ్డారు. భూముల సేకరణకు రూ.57 కోట్లు ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని మోడీ ప్రభుత్వాన్ని దయాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News