Friday, May 10, 2024

లెక్క సరి చేశారు..

- Advertisement -
- Advertisement -

లెక్క సరి చేశారు.. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం
చెలరేగిన అక్షర్, అశ్విన్, కుల్దీప్ జోరు.. ఇంగ్లండ్‌కు భారీ ఓటమి

India win 2nd Test by 317 runs against England

చెన్నై: ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతేగాక, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 482 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్‌పై పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ మరో 111 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. నాలుగో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కనీసం పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేశారు. దీంతో ఆసక్తికరంగా సాగుతుందని భావించిన మ్యాచ్‌లో ఏకపక్ష ఫలితం నమోదైంది. అక్షర్ పటేట్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు గెలుపుతో తనవంతు సహకారం అందించాడు. కుల్దీప్ యాదవ్ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆరంభం నుంచే..
53/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. అశ్విన్ ప్రారంభంలోనే లారెన్స్ (26)ను ఔట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఈ దశలో కెప్టెన్ జో రూట్ కొద్ది సేపు పోరాటం చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మరోవైపు జట్టును ఆదుకుంటారని భావించిన బెన్‌స్టోక్స్(8), ఓలీపోప్ (12), బెన్ ఫోక్స్(2) వెంటవెంటనే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 116/7గా నిలిచింది. దీంతో అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. ఇక రెండో సెషన్‌లో కూడా భారత బౌలర్లు జోరును ప్రదర్శించారు. అక్షర పటేల్ వరుస ఓవర్లలో రూట్(33), స్టోన్(0)లను ఔట్ చేశాడు. అయితే, ఈ సమయంలో మొయిన్ అలీ కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మొయిన్ అలీ 18 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే క్రమంలో బ్రాడ్‌తో కలిసి పదో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. మొయిన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 164 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ ఐదు, అశ్విన్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు.

India win 2nd Test by 317 runs against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News