Monday, May 13, 2024

త్వరలో రేషన్ రైస్‌ ఎటిఎంలు

- Advertisement -
- Advertisement -

Ration Rice‌ ATMs coming soon

 

న్యూఢిల్లీ : రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అయితే కొత్త ఏడాది నుంచి ఈ స్కీమ్‌ మరింత కొత్తగా కనిపించనుంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. కిలో మీటర్ల మేర క్యూ లైన్‌లో నిల్చుని రేషన్ సరుకులు తీసుకునే పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకోసం ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటామో అలాగే రైస్ తీసుకోవచ్చు. త్వరలోనే రేషన్ బియ్యం, గోధుమలను పొందేలా ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News