Monday, April 29, 2024

ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi writes to PM modi on fuel price rise

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మే మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ”చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఉద్యోగాలు పోతున్నాయి. ఆదాయాలు పడిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచి ఆరున్నరేళ్లలో రూ.21లక్షల కోట్లు ఆర్జించింది. ఈ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలపై భారం మోపడం, బాధ పెట్టడం సరికాదు.” అని సోనియా గాంధీ లేఖలో తెలిపారు. కాగా, దేశంలో గత 12 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేటు రూ.100 దాటింది. దీంతో కేంద్రంపై వాహనాదారులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Sonia Gandhi writes to PM modi on fuel price rise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News