Tuesday, April 30, 2024

26న భారత్ బంద్

- Advertisement -
- Advertisement -

bharat bandh on 26 feb 2021

న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే బిల్లు వంటి సమస్యలపై నిరసనగా భారత్ బంధ్‌ను సిఎఐటి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ట్రేడర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 వేల ట్రేడ్ సంస్థలు బంధ్‌కు మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-: ఎఐటిడబ్లుఎ) కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది.

బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘం బంద్‌కు మద్దతిస్తాయని ఎఐటిడబ్లుఎ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నామని, దీంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన ఇ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు తగ్గించాలని, దేశవ్యాప్తంగా ధరలు ఒకేలా ఉండాలని కోరారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ‘చక్కా జామ్’ (జాతీయ రహదారుల దిగ్భంధం)ను చేపడతామని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సిఎఐటి) ప్రకటించింది. 26వ తేదీన రహదారుల దిగ్బంధం చేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News