Wednesday, May 15, 2024

రెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్…. యువతి ధర్నా

- Advertisement -
- Advertisement -

Young women strike for Lover in Karnataka

 

బెంగళూరు: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు… రెండో పెళ్లికి సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సిద్ధం కావడంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సంఘటన కర్నాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సిఆర్‌పిఎఫ్‌లో ప్రమోద్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ప్రమోద్-అనూజా ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 19న యలహంక సమీపంలోని క్యాంపస్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. మూడు రోజులు ఆమెతో కాపురం చేసిన అనంతరం అతడు కనిపించకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ప్రమోద్ మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకొని నందగుడి పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News