Monday, May 6, 2024

ఐపిఎల్ స్పాన్సర్లకు స్టార్ ఇండియా అండ

- Advertisement -
- Advertisement -

Star India support for IPL sponsors

 

న్యూఢిల్లీ : కరోనా మహమ్మరి దెబ్బకు ఐపిఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపిఎల్ మధ్యలోనే ఆగిపోవడంతో ప్రకటన కర్తలు, స్పాన్సర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ ఇండియా చానల్ తమ స్పాన్సర్లు, ప్రకటన కర్తలకు అండగా నిలవాలని నిర్ణయించింది. కాగా, స్టార్ ఇండియా 2018-2022 ఐపిఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసార హక్కులను పొందిన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాలకు గాను స్టార్ స్పోర్ట్ చానల్, ఐపిఎల్ టివి, డిజిటల్ హక్కులను రూ.16,348 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేందుకు బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మ్యాచ్‌లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు స్టార్ ఇండియా టైమ్ స్లాట్‌లను అమ్మకుంది.

మరోవైపు ఐపిఎల్ సీజన్14లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఐపిఎల్ వాయిదాతో ప్రకటన కర్తలు, స్పాన్సర్లు భారీ మొత్తంలో నష్టపోయే ప్రమాదం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో స్టార్ ఇండియా యాజమాన్యం స్పాన్సర్లు, ప్రకటన కర్తలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బు చెల్లింపులు జరపాలని కోరింది. మిగతా వాటికి.. బిసిసిఐ ఎప్పుడు ఐపిఎల్ నిర్వహిస్తే అప్పుడు చెల్లించాలని సూచించింది. ఇదిలావుండగా ఈ ఏడాది ఐపిఎల్‌ను రికార్డు స్థాయిలో 352 మంది వీక్షించారు. గతంలో అన్ని మ్యాచ్‌లను కలిపి 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి 29 మ్యాచ్‌లకే ఇంత మంది టివిల్లో ఐపిఎల్ ప్రసారాలను చూడడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News