Sunday, May 12, 2024

ఈ గెలుపు మారడోనాకు అంకితం: లియొనల్ మెస్సీ

- Advertisement -
- Advertisement -

బ్రాసిలా: సుదీర్ఘ విరామం తర్వాత తాము సాధించిన కోపా అమెరికా సాకర్ ట్రోఫీని దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనాకు అంకితం ఇస్తున్నట్టు అర్జెంటీనా కెప్టెన్ లియొనల్ మెస్సీ పేర్కొన్నాడు. అసాధారణ ఆటతో అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు కొత్త దిశను చూపిన మారడోనాకు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక, సుదీర్ఘ కెరీర్‌లో ఓ మేజర్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడం గర్వంగా ఉందన్నాడు. తమ దిగ్గజం ఆటగాడు మారడోనా స్ఫూర్తితోనే కోపా అమెరికా టోర్నమెంట్‌లో అసాధారణ ఆటను కనబరచామన్నాడు. కిందటి ఏడాది అకాల మరణం చెందిన తమ ఫుట్‌బాల్ హీరో కోసం ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలని జట్టు సభ్యులంత లక్ష్యంగా పెట్టుకున్నామని, అనుకున్నట్టే ట్రోఫీని సాధించడం గర్వంగా ఉందని మెస్సీ పేర్కొన్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మెస్సీ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Lionel Messi dedicates Copa Victory to Maradona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News