Tuesday, May 7, 2024

చైనా అధ్యక్షుని టిబెట్ సందర్శన

- Advertisement -
- Advertisement -

Chinese President visits Tibet

 

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు పట్టణంలో జిన్‌పింగ్

బీజింగ్: భారత్ భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోని టిబెట్ సరిహద్దు పట్టణం నియంజిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధ్యక్ష హోదాలో మొట్టమొదటిసారి సందర్శించారు. బుధవారం నియంజి మెయిన్లింగ్ విమానశ్రయానికి చేరుకున్న జిన్‌పింగ్‌కు స్థానిక ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికినట్లు జిన్హువా వార్తాసంస్థ శుక్రవారం తెలిపింది. బ్రహ్మపుత్ర నది బేసిన్‌లో పర్యావరణ పరిరక్షణను పరిశీలించేందుకు ఆయన నియాంగ్ నదిపై నిర్మించిన వంతెనను సందర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న నియంజి పట్టణంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తుండగా దీన్ని భారత్ తిరస్కరిస్తోంది. 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖపై భారత్-చైనా మధ్య సుదీర్ఘ కాలంగా వివాదం నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News