Friday, May 10, 2024

అప్పుడే వివక్ష నుంచి దళితులు దూరమవుతారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

dalit bandhu scheme

CM KCR speech on Dalit bandhu

హైదరాబాద్: దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథకంపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఇవాళ్లి సదస్సులో పాల్గొన్న వాళ్లు హుజూరాబాద్‌లో విజయం సాధించి దళిత బంధు పథకంపై తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తుందన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని అంటరానితనం పేరుతో ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమైన విషయమని స్పష్టం చేశారు. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం తెలివి తక్కువ పని కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమైందని గుర్తు చేశారు. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు.

ప్రతీ విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయని, నమ్మిన ధర్మానికి కట్టుబడి మనం ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమవుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని, మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి సెంటర ఫర్ సబాల్టర్ స్టడీ ద్వారా అధ్యయనం చేశామని, దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్ స్టేషన్‌లో రద్దు చేసుకోవాలన్నారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని అప్పుడే విజయానికి బాటలు పడతాయని వివరించారు.

ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలన్నారు. ప్రభుత్వ వర్గాలతో పని చేయించుకునే క్రమంలో ఇవాళ్టి సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలావర్గంగా డేగ కన్నుతో పని చేయాలని కెసిఆర్ సూచించారు. దళితబంధు పథకం పటిష్ట అమలుకు మమేకమై పని చేయాలన్నారు. ఎరువులు దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్ షాపులు వంటి ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని, ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటే ఇతర రంగాలను గుర్తించి దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News