Friday, May 3, 2024

జమ్మి మొక్కను నాటిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Indra Karan reddy plant tree

నిర్మ‌ల్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా “ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు” కార్య‌క్ర‌మంలో అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అడెల్లి పోచమ్మ అమ్మవారి గుడి ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ… విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును తెలంగాణలో దసరా నాడు పూజించడం అనాదిగా వ‌స్తున్న‌ ఆచారమ‌న్నారు. హైందవ సంప్రదాయంలో ప్రాధాన్యత కలిగిన జమ్మి చెట్టును సిఎం కెసిఆర్ రాష్ట్ర వృక్షంగా ప్రకటించారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఇదే స్ఫూర్తితో అందరు మొక్కలు నాటాలి అని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నామ‌న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News