Sunday, May 5, 2024

త్వరలో సిద్ధిపేట-చిన్నకోడూర్ కు నాలుగు లేన్ల రహదారి..

- Advertisement -
- Advertisement -

370 grams gold for Lakshmi Narasimha

సిద్ధిపేట: పట్టణ బారయిమామ్ చౌరస్తా నుంచి చిన్నకోడూర్ వరకూ 10కిలోమీటర్ల మేర రూ.80 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రహదారి మంజూరైనట్లు, త్వరలోనే పనులు ప్రారంభం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రమైన చిన్నకోడూర్ ఏంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉదయం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిన ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నార్మల్ డెలివరీ చేసుకుని మీ ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రైవేటు దవాఖానకు వెళ్లి మీ డబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. జిల్లా కేంద్ర ఏరియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పాక్షికంగా ఇండ్లు కూలిపోయిన 207 మందికి రూ.6 లక్షల 62 వేల చెక్కులు ఇస్తున్నామన్నారు. చిన్నకోడూరు మండలంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఒక్కొక్కరికీ లక్ష 116 రూపాయల చొప్పున 150 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 50 లక్షల 17 వేల 400 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రాంతాలలో ఇవ్వని కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు.

Siddipet to Chinnakodur 4 way road Sanction: Harish

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News