Tuesday, May 7, 2024

ఢిల్లీలో అత్యంత దుర్భరంగా వాయు ప్రమాణం

- Advertisement -
- Advertisement -

Heavy air pollution in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి నాణ్యత వరుసగా మూడవ రోజు మంగళవారం అత్యంత దుర్భరం(వెరీ పూర్) క్యాటగిరిలో ఉంది. గాలి నాణ్యత ఇండెక్స్(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-ఎక్యుఐ) 396గా రికార్డయినట్లు సమీర్ యాప్ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీకి పొరుగున ఉన్న ఘజియాబాద్‌లో 349, గ్రేటర్ నోయిడాలో 359, గుర్గావ్‌లో 363, నోయిడాలో 382గా గాలి నాణ్యత ఇండెక్స్ మంగళవారం ఉదయం నమోదైంది.

ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో ఎక్యుఐ వెరీ పూర్ క్యాటగిరిలో ఉందని, ద్వారకా సెక్టార్-8, పత్పర్‌గంజ్, అలీపూర్, షాదీపూర్, డిటియు, పంజాబీ బాగ్ వంటి ప్రాంతాల్లో ఇది 400దాటి ఆందోళనకరస్థాయి(సివియర్) క్యాటగిరికి చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. 0-50 మధ్య ఎక్యుఐ ఉంటే దాన్ని గుడ్‌గా, 51-100 మధ్య ఉంటే దాన్ని శాటిస్ఫాక్టరీగా(సంతృప్తికరం), 101-200 ఉంటే మోడరేట్‌గా(మోస్తరు), 201-300 మధ్య పూర్‌గా, 301-400 వెరీ పూర్‌గా 401-500 మధ్య సివియర్‌గా పరిగణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News