Tuesday, May 21, 2024

ఇద్దరు మహిళా క్రికెటర్లలో ఒమిక్రాన్ వేరియంట్‌..

- Advertisement -
- Advertisement -

Omicron confirmed in Bangladesh women's cricket team

ధ్రువీకరించిన బంగ్లాదేశ్

ఢాకా: జింబాబ్వే నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన జాతీయ క్రికెట్ టీమ్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు బంగ్లాదేశ్ ధ్రువీకరించింది. “ ఆ ఇద్దరిని ఓ హోటల్‌లో క్వారెంటైన్ ఉంచాము. వారు బాగానే ఉన్నారు” అని ఆరోగ్య మంత్రి జాహిద్ మాలెక్యూ శనివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. వారి పేర్లు వెల్లడించకుండానే వారు 21, 30 ఏళ్ల వయస్సున్న క్రీడాకారిణులని తెలిపారు. వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన అందరినీ పరీక్షించామని, కానీ ఎవరిలో కొవిడ్19 పాజిటివ్ కనిపించలేదని తెలిపారు. “ టీమ్‌లోని మిగతా అందరినీ క్వారంటైన్‌లో ఉంచాము. భయపడాల్సిన అవసరం ఏమీలేదు”అని కూడా ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ ఐసిసి విమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ రౌండే ఆడేందుకు అక్టోబర్‌లో జింబాబ్వే వెళ్లింది. క్వాలిఫయర్‌గా తమ దేశానికి తిరిగొచ్చింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 1578996 కరోనావైరస్ కేసులు, 28022 మరణాలు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News