Saturday, May 11, 2024

స్వంత పార్టీ కాంగ్రెస్‌పై హరీశ్ రావత్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Harish Rawat comments on own party Congress

డెహ్రాడూన్ : త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రచార సారధిగా, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా ఉంటున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారి పార్టీ అధిష్ఠాన వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలన్న సముద్రంలో ఈదుతున్న తనకు అధిష్ఠానం మద్దతు ఇవ్వాల్సింది పోయి, వెన్నుపోటు పొడుస్తోందని, తనకు వ్యతిరేకంగా కొన్ని మొసళ్లను కూడా పార్టీ జారవిడిచిందని ఆయన వ్యాఖ్యానించారు. నీవు చాలా దూరం ఈదావు. ఇకచాలు. విశ్రాంతి తీసుకోవడం మంచిదని కొన్నిసార్లు అంతరాత్మ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తానిప్పుడు సందిగ్ధంలో ఉన్నానని, కొత్త సంవత్సరం దారి చూపిస్తుందన్న ఆశాభావంతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News