Sunday, May 5, 2024

ఖమ్మంలో 100శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తైంది: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ 100% పూర్తి చేసిన జిల్లా యంత్రాంగానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. జిల్లాలో 100 శాతం మొదటి డోస్ వాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందించిన సందర్భంగా జడ్పీ హాల్ లో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులకు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారని, వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తైందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సహసోపేతంగా పనిచేశారని అభినందించారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసును అంద‌రూ త‌ప్ప‌కుండా వేయించుకోవాల‌ని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ తో పాటు ప్రతి ఒక్కరు మస్కులు తప్పక ధరించాలని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు.

100% First dose vaccination completed in Khammam: Puvvada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News