Saturday, August 9, 2025

ఎస్‌ఎల్‌బిసి పనుల పునరుద్ధరణకు రూట్‌ మ్యాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అర్ధాంతరంగా ని లిచిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బిసి)ప్రాజెక్టు పనుల పునరుద్దరణకు ప్రణాళిక బ ద్దంగా కార్యాచరణతో ముందుకుసాగాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీ క్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బిసి కార్యచరణ అ మలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతో పాటు పాలనపరమైన అనుమతుల కోసం త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క మల్లుతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల ప్రమాదం త దుపరి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటి నివేదిక, సూచనలకు లోబడి పునరుద్దరణ చర్యలు చేపడతామన్నారు. శ్రీశైలం దిగువభాగం నుంచి వచ్చే వరద కాలువతో పాటు మిగిలిపోయిన తొ మ్మిది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందని మంత్రి వివరించారు.

ఆనీటిని ఎత్తిపోసేందుకు ఏటా రూ.750 కోట్ల విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ఫ్లోరోసిస్ రహిత సాగునీరు, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఎస్‌ఎల్‌బిసి సొ రంగమార్గం పూర్తి అయ్యే సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఎస్‌ఎల్‌బిసి పునరుద్దరణ చర్యల్లో భాగంగా నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్‌ఐ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమేగ్నటిక్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు పర్వత భూభాగంలో ఉన్నందున హెలికాప్టర్ సర్వే తప్పనిసరైందన్నారు. ప్రాజెక్టు పునరుద్దరణ పనులు ప్రారంభానికి ఈ సర్వే ఎంతో దోహదపడుతుందన్నారు. దీంతో పాటు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జిఎస్‌ఐ)ని కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. పునరుద్దరణ పనులు ప్రణాళిక బద్దంగా నిర్వహించేందుకు ఏరియల్ లైడార్ సర్వే కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన అంచనా వ్యయాన్ని మించనీయకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

సింగూరు డ్యామ్‌కు భద్రత చర్యలు
సింగూరు డ్యామ్ పరిస్థితులను పరిశీలించి అత్యవసరంగా భద్రతాచర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలంలో రాష్ట్రంలో ఉన్న డ్యామ్‌లు, రిజర్వాయర్లతో పాటు అన్ని జలాశయాలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.

సమ్మక్క సారక్క బ్యారేజిపై నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్‌తో పాటు ఎపిలోని పోలవరం బ్యాక్ వాటర్‌తో ఛత్తీస్‌ఘడ్ పై చూపే ప్రభావాలపై ఐఐటి ఖరగ్‌పూర్ జరిపిన అధ్యనం నివేదిక ప్రభుత్వానికి అందినట్లు మంత్రి తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని తుపాకులగూడెం గ్రామం సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సమ్మక్క బ్యారేజ్ నిర్మాణంతో ఛత్తీస్‌ఘడ్‌లో సుమారు నలబై హెక్టార్ల భూములు ముంపు నకు గురవుతుందని ఐఐటి ఖరగ్‌పూర్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్‌ఘడ్ లోని కోటూర్, తార్లగూడ, గంగారాం, కంబల్పేట లలో దాదాపు 10.9 చదరపు కిలోమీటర్ల భూభాగం ముంపునకు గురవుతుందని అధ్యయనంలో తేలిందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టు అవసరమైన అనుమతులు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమ్మక్క సారక్క బ్యారేజి నిర్మాణం ద్వారా సుమారు 6.94టిఎంసిల నీటితో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2022 సంవత్సరంలో పూర్తికావాల్సి ఉందని, వివిధ కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిపారు.

ఇంజినీర్లకు పదోన్నతులు
మూడు దశాబ్దాల సుధీర్ఘ విరామం తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసిందని మంత్రి తెలిపారు. ప్రతిభ, సీనియారిటీ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎఎఇ) నుంచి చీఫ్ ఇంజనీర్(సిఇ) వరకు అధికారులున్నట్లు తెలిపారు. పదోన్నతులు పొందిన ఇంజినీర్లు తమ విధినిర్వహణలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే చర్యల్లో భాగస్వాములు కావాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News