మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవమే ప్రత్యామ్నాయమని, భారీ వర్షాలు పడిన తట్టుకునేలా వ్యవస్థల ప్రక్షాళన, ప్రత్యేక ప్రణాళికలు రూ పొందించాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీ ల్లో అంతరాయం లేకుండా, చిక్కుల్లేకుండా చ ర్యలు చేపట్టాలని, చెరువులు, కుంటలు, నాలా లు, ఎస్టీపిల ద్వారా మూసీకి అనుసంధానించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. నగరంలో భారీ వర్షాలు కురిసి నా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ దేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్ త రాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా ప నులు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
వర్షాల తో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందు కు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలం టే అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అ ధికారులను అప్రమత్తం చేశారు. త్రాగు నీరు, వ రద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి గురువారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
గురువారం రాత్రి హైదరాబాద్‌లో నాలుగు గంటల్లోనే 15 సెంటీమీటర్ల వర్షపాతం
అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను సిఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో గురువారం రాత్రి అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ స్తంభించటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షం ఒకేసారి కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమయ్యిందని అధికారులు సిఎం రేవంత్‌తో తెలిపారు. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్నీ వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సిఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అధికారులు ముఖ్యమంత్రితో పేరొన్నారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని, జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదయ్యిందని అధికారులు సిఎంతో తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా
అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవ్వకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయన్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు.
వరద నీరు మూసీలోకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపులా నుంచి వరద నీరు మూసీలోకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతి చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయని సిఎం అన్నారు. కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా…
ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సిఎం అధికారులకు సూచించారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందన్నారు. భవిష్యత్‌లో వందేళ్ల పాటు మహానగరంలో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే అవసరమని సిఎం అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రీయల్ జోన్ ఏర్పాటు
ముఖ్యంగా పాతనగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్ జోన్‌ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్ లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్ ల ఏర్పాటుతో రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సిఎం అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండిఏ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, ఎంఆర్డీసిఎల్ ఎండి ఈవి నర్సింహారెడ్డి, జేఎండి గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.