Saturday, August 9, 2025

షూటింగ్‌లు ఆపండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు సినిమా షూటింగ్‌లను ఆపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్‌లను ఎక్కడికక్కడ నిలిపివేయాలని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. సినిమా కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిర్మాతలను షూటింగ్‌లను ఆపివేయాలంటూ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి సూచనలు ఇచ్చే వరకూ ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్… కార్మికుల వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను నిర్మాతల మండలి అంగీకరించకపోవడంతో, షూటింగ్‌లను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. అయితే దీనిపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్… ఫెడరేషన్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండించింది. చిన్న నిర్మాతలు ఈ వేతన పెంపును భరించలేరని, ఇది చిత్ర పరిశ్రమకు మరింత నష్టం కలిగిస్తుందని ఛాంబర్ అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News