ఇప్పటికే ఆమోదం లభించిన దరఖాస్తులకూ వర్తించదు
ప్రస్తుత హెచ్1బి వీసాదారులకు ఈ పెంపుతో సంబంధం లేదు
ఆందోళనల నేపథ్యంలో వైట్‌హౌస్ స్పష్టత
వాషింగ్టన్: హెచ్1బి వీసాకోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల వీసా రుసుము వర్తిస్తుందని అమెరికా అధికారులు శనివారం నాడు స్పష్టం చేశారు. వీసా ఫీజు పెంపుపై భయాందోళనలు రేకెత్తిస్తూ మీడియా లో కథనాల నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంతో సహా అమెరికాలో పని చేసేందుకు కార్మికులను నియమించుకునే కంపెనీలు చెల్లించాల్సిన వీసా ఫీజు పెంచే ప్రకటనపై ప్రెసిడెంట్ ట్రంప్ సంత కం చేసిన ఒక రోజు తర్వాత అమెరికా అధికారులు ఈ స్పష్టతను ఇచ్చారు.
హెచ్ – 1బి ఫీజు పెంపు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఈ ఫీజు నిబంధనలు అమలులోకి వస్తే, నిపుణులైన ఉద్యోగులను అంతర్జాతీయ దేశాలనుంచి నియమించుకునే కంపెనీ లు. వీసాపై పనిచేసే ఏ ఉద్యోగినైనా ఆరు సంవత్సరాలవరకూ ప్రతి సంవత్స రం లక్ష అమెరికా డాలర్లు చెల్లించవలసి ఉంటుందని వైట్ హౌస్ అధికారి చె ప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.1,00,000 డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని అధికారి తెలిపారు. ప్రస్తుతం హెచ్1బి వీసా పై పనిచేస్తున్నవారికి ఫీజు పెంపు వర్తించబోదని వివరించారు. ప్రస్తుతం హె చ్-1బి వీసా హోల్డర్లు భయాందోళనలు చెందాల్సిన అవసరం కానీ, తొందరప డి తమ దేశాలకు వెళ్లిపోవల్సిన అవసరం కానీ లేదని అమెరికా అధికారి తెలిపారు.
భారతీయుల ఆందోళనలు, ప్రయాణాల రద్దు
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హఠాత్‌గా హెచ్ -1బి నాన్- ఇమిగ్రెంట్ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచాలని ఆదేశించారు. దీంతో హెచ్-1 బి వీసాతో అమెరికాలో ఉన్న భారతీయ నిపుణులు తమపై ప్రభావం పడగలదని ఆం దోళన చెందారు. ట్రంప్ ఆదేశాలు వెలువడిన తర్వాత చాలామంది భారతీయులు స్వదేశ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సెప్టెంబర్ 21న రాత్రి 12 గంటలనుంచి కొత్తనిబంధనలు అమలులోకి వస్తాయని ప్రెసిడెంట్ ఆర్డర్ వెలువడిం ది. దీంతో భయాందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హడావుడిగా, కంపెనీలు హెచ్-బి వీసా హోల్డర్లు లేదాప్రస్తుతం అమెరికా పొరుగు దేశాల్లో ఉన్న వారి కుటుంబసభ్యులు సెలవులపై వెళ్లి ఉంటే, 24 గంటల్లో తిరిగి రావాలని, లేదా చిక్కుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే అమెరికాకు ప్రవేశం నిరాకరించవచ్చని హెచ్చరించడంతో ఆందోళనలు హెచ్చాయి. భారతదేశానికి వెళ్లేందుకు విమానాలు ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్‌లో ఉన్న చాలా మంది, ప్రయాణం రద్దు చేసుకోగా, భారతదేశంలో ఇప్పటికే ఉన్న చాలామంది హుటాహుటిన అ మెరికాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది దీపావళి కోసం, పిల్లల కాలేజీలు, స్కూళ్లకు సెలవు ఉండడంతో భారతదేశం వెళ్లినవారే ఎక్కువ. ప్రస్తుతం హెచ్ -1బి దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు చెల్లించే రుసుం దాదాపు 2 వేలనుంచి 5 వేల అమెరికా డాలర్ల మేరకు ఉంది. భారతీయ టెక్ నిపుణులలో హెచ్-1బి వీసాలు మూడేళ్లు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మరో మూడు ఏళ్లపాటు పొడిగిస్తారు.