Thursday, September 25, 2025

మళ్లీ కెప్టెన్‌గా శ్రేయస్.. ఈసారి ఏం చేస్తాడో..

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఈ టోర్నమెంట్‌ కోసం జట్టును ప్రకటించినప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) ఎంపిక చేయనపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్‌ కోసం ప్రకటించిన భారత్ ఎ జట్టుకు శ్రేయస్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ నిరాశపరిచాడు. బ్యాటింగ్ పరంగా అతడు రాణించలేకపోయాడు. దీంతో రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ధృవ్ జురెల్‌కి కెప్టెన్సీ అప్పగించారు.

అయితే ఇప్పుడు ఆసీస్ ఎ జట్టుతో జరిగే మూడు అనధికారిక వన్డేల సిరీస్‌ కోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో శ్రేయస్‌కి (Shreyas Iyer) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఫెయిల్ అయిన శ్రేయస్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏం చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ అతడు ఫామ్‌లోకి వచ్చి రాణించాలని ఆశపడుతున్నారు. ఇక రెండు, మూడు వన్డేలకు ఆసియాకప్‌లో ఉన్న తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు జట్టుతో జతకడతారు. అంతేకాక.. తిలక్ ఆడుతున్న రెండు మ్యాచ్‌లకు అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మూడు మ్యాచ్‌లలో అభిషేక్ పొరెల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు.

Also Read : టి20లో ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News