ఆసియాకప్ తర్వాత భారత్ (Team India).. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఇంగ్లంగ్తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్..ఈ సిరీస్‌కి దూరమయ్యాడు. అతని స్థానంలె వైస్ కెప్టెన్‌గా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. కీపర్‌గా ధృవ్ జురేల్ వ్యవహరించనున్నాడు.
ఇక మరో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఏడేళ్ల విరామం తర్వాత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. కానీ, అతడు ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఈ సిరీస్‌లో తలపడే జట్టులో అతడిపై వేటు పడింది. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణు చోటు దక్కించుకున్నారు. స్పిన్‌లో కుల్దీప్ యాదవ్‌తో పాటు స్పిన్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు జట్టులోకి (Team India) వచ్చారు.
వెస్టిండీస్ సిరీస్‌కి భారత జట్టు :
శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
Also Read : ఆసియా కప్ 2025 ఫైనల్‌కు భారత్