- Advertisement -
హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం సాయంత్రం సిటిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, ప్యాట్నీ, పారడైజ్, సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, చాదర్ ఘట్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. గత వారం రోజులుగా అకాశమంతా మబ్బులుగా ఉంటూ అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సిఎం రేవంత్ రెడ్డి వర్షాలపై స్పందించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
- Advertisement -