Thursday, September 25, 2025

భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంపు

- Advertisement -
- Advertisement -

టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్‌స్టాఫ్‌ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని టిజిటిఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ, అదేవిధంగా వేతనాలను పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. టెరాసిస్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న వారిని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌గా టిజిటిఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా సముచిత గౌరవాన్ని కల్పించింది. వారికి నెలకు రూ.12 వేల ఉన్న జీతాన్ని రూ.28,148లకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంతటి నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ స్టాఫ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన ప్రభుత్వానికి, సిసిఎల్‌ఏ లోకేష్‌కుమార్, సిఎమ్మార్వో పిడి మకరందం, తెలంగాణ ఉద్యోగుల జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డిలకు తెలంగాణ భూ భారతి ఫీల్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్‌టిఎస్) అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌నకు శుభాకాంక్షలు
తెలంగాణ ఉద్యోగ జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి
ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సమస్యను పరిష్కరించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబుకు సిసిఎల్‌ఏ కమిషనర్‌కు, రెవెన్యూ సెక్రటరీకి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఫీల్ఢ్ టెక్నికల్ స్టాఫ్‌నకు వి.లచ్చిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు మరింత బాధ్యతగా, పారదర్శకమైన సేవలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రతినెలా ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌నకు రూ.21,446 వేతనం అందనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 708 మందికి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News