శుభ్‌మన్‌కే పగ్గాలు
వైస్ కెప్టెన్‌గా జడేజా, నాయర్, శార్దూల్‌లకు ఉద్వాసన
విండీస్‌తో టెస్టులకు టీమిండియా ఎంపిక
దుబాయి: సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గురువారం టీమిండియాను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆసియాకప్ టోర్నమెంట్ కోసం శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్‌లు దుబాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. వారితో గురువారం భేటి అయిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా గాయపడిన రిషబ్ పంత్‌కు బదులు ఎన్.జగదీశన్‌కు టీమిండియాలో చోటు లభించింది. అంతేగాక ఇంగ్లండ్ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌లకు జట్టులో స్థానం దక్కలేదు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దేవదత్ పడిక్కల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
కొంతకాలంగా పడిక్కల్ నిలకడైన ఆటతో అలరిస్తున్నాడు. అతనితో పాటు దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న జగదీశన్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రమోషన్ దక్కింది. అతనికి కీలకమైన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి మరో ఛాన్స్ దక్కింది. సీనియర్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జట్టులో స్థానాన్ని కాపాడుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తదితరులు కూడా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించిన కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లతో పాటు సాయి సుదర్శన్ జట్టులో చోటును సంపాదించడంలో సఫలమయ్యాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ రెండు నుంచి టెస్టు సిరీస్ జరుగనుంది. ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. భారత్‌తో సిరీస్ కోసం విండీస్ కూడా ఇప్పటికే జట్టును ప్రకటించింది. మొదటి టెస్టుకు అహ్మదాబాద్ వేదికగా నిలువనుంది. అక్టోబర్ 10 నుంచి జరిగే రెండో టెస్టుకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
జట్టు వివరాలు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఎన్.జగదీశన్.
Also Read: ప్రపంచకప్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్