Friday, September 26, 2025

కూతురుకు పురుగుల మందు తాగించి…. తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య మరొక వ్యక్తితో తిరుగుతుందని భర్త మానసికంగా కుంగిపోయి కూతురుకు పురుగు మందు తాగించి అనంతరం అతడు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంచం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్(35)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య స్వాతిని సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం చేస్తున్నాడు. స్వాతి, సంతోష్ దంపతలుకు హైమా(11) అనే కూతురు కూడా ఉంది.

Also Read: విచిత్ర కవలలు… కడుపులో పెరుగుతున్నది సోదరుడే

గత కొన్ని రోజుల స్వాతి మరో వ్యక్తి తిరుగుతుందని ఆమెతో భర్త గొడవ పడుతున్నాడు. పెద్దపాడు గురుకుల పాఠశాలలో హైమా చదువుతోంది. దసరా సెలవులు రావడంతో తల్లి హైమాను ఇంటికి రాత్రి తీసుకొచ్చింది. ఉదయం వెళ్లిన భార్యను రాత్రి వరకు ఏ చేశావంటూ భర్త ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కూతురును జీరుపాలెంలో తన తల్లిదండ్రులకు వద్దకు సంతోష్ తీసుకెళ్లాడు. అనంతరం మరుసటి రోజు కూతురును మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. కూతురుకు పురుగుమందు తాగించి అనంతరం అతడు తాగాడు. ఇరుగుపొరుగు వారు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News