Tuesday, May 14, 2024

ప్రతి తండాకు అండ కాంగ్రెస్ జెండా

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గిరిజన రిజర్వేషన్‌తో పాటు అటవీహక్కుల కల్పన, తండాల్లో మౌలిక వసతుల కల్పన తదితర గిరిజన అభివృద్ధి,సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. ప్రతి తండాకు అండ కాంగ్రెస్ జెండా అనే నినాదంతో చేపట్టిన గిరిజన చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం త్రిపురారం మండలంలోని లోక్యతండా, బడాయిగడ్డతండా, హార్జతండా, సీత్యాతండా, రాజేంద్రనగర్ తదితర తండాలలో నిర్వహించిన చైతన్య (పాద) యాత్రలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను అన్నివిధాల మోసం చేసిందని , ముఖ్యంగా గిరిజన రిజర్వేషన్‌ల పెంపు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటించకపోవడంతో విద్యా ఉద్యోగ రంగాలలో వారికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసన సభ్యులుగా ,మ ంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన జనారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప 9ఏండ్ల కాలంలో ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదని అన్నారు. మీ అందరి అండ ఆశీస్సులతో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే జానారెడ్డి తనయుడిగా, మీ బిడ్డగా మీకు అన్ని విధాల అండగా ఉంటూ ఎన్నో ప్రజా రంజక పథకాలు ముఖ్యంగా గిరిజన అభివృధ్ది కొరకు పాటు పడతుందన్నారు. అంతకుముందు వివిద దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. గిరిజన మహిళలు హమారా జానారెడ్డి కూండాఆచ్‌రే అంటూ సంప్రదాయ నృత్యాలతో, ఆటపాటలు, కోలాటాలతో హారతులుపట్టి పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటారు.

ప్రతి తండాలో పార్టీ జెం డాను ఆవిష్కరించడంతో తండాలన్నీ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో, తండాలన్నీ మువ్వన్నె జెండాలతో జనసాంద్రాన్ని తలపించాయి. వివిద తండాలలోని పలు పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య సభ్యులు కర్నాటి లింగారెడ్డి ,పగిడి రామలింగయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, జడ్పీటసిలు ధనావత్ భారతి , నందికొండ రామేశ్వరి, ఎంపిపి అనుముల పాండమ్మ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ బాస్కర్ నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడిమాళ్ల బుచ్చిరెడ్డి, అంకతి సత్యం, యూత్ కాంగ్రెస్ , ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు రాజా రమేష్ యాదవ్, ఆరిఫ్, పార్టీ నాయకులు నాయకులు , కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News