Saturday, May 4, 2024

గ్రహణమొర్రితో జన్మించిన ఆడ శిశువు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: తొమ్మిది నెలలు మోసి కన్న కూతురిని కన్న తల్లితండ్రులు మురిపం కొద్ది నిమిషాల్లోనే కనుమరుగైంది. ఆ శిశువు ముఖం చూసి వారు ఖంగుతిని కన్నీరుమున్నీరు అయ్యారు. తమకు పుట్టిన శిశువు గ్రహణమొర్రితో పుట్టడమే ఇందుకు కారణం. తమ ఇంటికి మహాలక్ష్మీ వస్తుందని ఆశించిన వారికి గ్రహణమొర్రితో ఆ శిశువు జన్మించడం చూసి వారి ఆశలు ఆవిరైయ్యాయి. పాప బంగారు భవిష్యత్తు ఏమిటంటూ చలించిపోయారు. జీవితాంతం అందవీహీనమైన ముఖంతో తమ బిడ్డ సమాజంలో ఎన్ని అవమానాలో భరించాల్సి ఉంటుందని.. తమకు ఇలాంటి గతి ఎందుకు పట్టించావంటూ నిత్యం ప్రార్ధించే దేవున్ని వారు నిలదీశారు. తొమ్మిది రోజుల చంటి బిడ్డను మానుకోటలోని దంత వైద్యశాల రవిచంద్ర డెంటల్ సూపర్ స్పెషాలిటీకి తీసుకువెళ్లారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ భువనగిరి అనిల్ గుప్త ఆ ఆడ శిశువుకు అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆ బిడ్డ గ్రహణ మొర్రిని పూర్తిగా పరిశీలించారు.

గ్రహణమొర్రి జీవితాంతం ఆడ బిడ్డకు శాపం కాకుండా తన సంకల్పమైన ఆ శిశువు లోపాన్ని శస్త్ర చికిత్స ద్వారా సరిచేస్తానని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే సురేష్ అర్థిక పరిస్థితిని గమనించి సదరు వైడ్యుడు మానవత్వంతో స్పందిస్తూ అతని వద్ద నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోకుండానే ఉచితంగా ఆ శిశువుకు శాస్త్ర చికిత్స అందించి సరిచేసే బాద్యత తనది అని భరోసా ఇవ్వడంతో ఆ శిశువు తల్లితండ్రులు ఊపిరీ పీల్చుకున్నారు. ఆ దేవుడు తమ బిడ్డ తలరాతను గ్రహనమొర్రితో వంకరగా రాస్తే డాక్టర్ అనిల్ గుప్త తమ చంటి బిడ్డ పాలిట దేవుడిగా మారి గ్రహణమొర్రికి ఉచితంగా సరిచేస్తానని మాట ఇవ్వడం పట్ల వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిందింది. కొన్ని నెలల తర్వాత పాపకు శాస్త్ర చికిత్స చేసి గ్రహణమొర్రిని రూపుమాపుతానని డాక్టర్ అనిల్ గుప్త వారికి భరోసా కల్పించడంతో వారు సదరు వైద్యుడికి కృతజ్ఙతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News