Tuesday, April 30, 2024

షిన్లాక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎఆర్ రెహమాన్

- Advertisement -
- Advertisement -

A R Rahman is Sheenlac brand ambassador

హైదరాబాద్ : భారతదేశంలోని మొదటి ఆరు బ్రాండ్లలో ఒకటైన షిన్లాక్‌కు అస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు పద్మభూషణ్ ఎఆర్ రెహమాన్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆవిష్కరణ, సృజనాత్మకత, నాణ్యత వంటి లక్షణాలతో షీన్లాక్ టివి, ప్రింట్ మీడియా, డిజిటల్, ఇతర మాధ్యమాల్లో జరిగే ప్రచారాల్లో యాడ్స్‌లో ఎఆర్ రెహమాన్ పాల్గొంటారని ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తం గా ఫాలోయింగ్ కలిగిన ఎఆర్ రెహమాన్ తో అనుబంధం ద్వారా షీన్లాక్ భారతదేశంలో తన నాయకత్వ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో సహాయపడుతుందని, విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు తోడ్పడుతుదంని షీన్లాక్ పెయింట్స్ టిమిటెడ్ ఎండి సుధీర్ పీటర్ పేర్కొన్నారు. ఎఆర్ రెహమాన్ తో ఏర్పరుచుకున్న అనుబంధం తమకు సంతోషం కలిగించిదని ఆయన తెలిపారు.

A R Rahman is Sheenlac brand ambassador

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News