Saturday, May 4, 2024

రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (పిఎస్‌ఐఎల్-24) కార్యక్రమం గురించి సిఎం రేవంత్‌కు వారు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్య కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సిఎం కోరారు.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుంచి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్ లీడర్‌షిప్ (పిఎస్‌ఐఎల్-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండి రైట్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News