Sunday, April 28, 2024

పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయ శాస్త్ర పట్టబధ్రులైన యువతీ యువకులకు జిల్లాలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఫ్లీడర్‌లు జూనియర్‌గా చేర్పించి 3 సంవత్సరాలలో న్యాయశాస్త్ర పరిపాలన యందు స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి జగదీష్ అన్నారు. 2023/24 సంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లా యందలి షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు 8 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. న్యాయశాస్త్రంలో పట్టాపొంది సంవత్సర ఆదాయం రెండు లక్షలకు మించని వారు అర్హులన్నారు. మీ సేవ నుంచి ఏప్రిల్ 2023న పొందిన కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలతో డిగ్రీ న్యాయశాస్త్ర విద్య పట్టాలతో బార్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులతో www.telanaganaepass.cgg.gov.inలో నేటి నుంచి ఈ నెల30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News