Tuesday, May 7, 2024

అసోం ప్రాణంగా తూర్పు పాలసీ : జై

- Advertisement -
- Advertisement -

Act East Policy will make Assam more connected and energetic

 

గువహతి : దేశ తూర్పు అనుకూల పాలసీకి అసోం కేంద్ర బిందువు అవుతుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. అసోం సర్వతోముఖాభివృద్ధి క్రమంలోనే దేశ ఈస్ట్ పాలసీ క్రియాశీలకం అవుతుందని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దేశానికి భౌగోళిక ప్రాధాన్యత దిశలో అసోం ఉందని, ఇక్కడి ప్రగతి ప్రాతిపదికనే దేశానికి చెందిన ఈస్ట్ పాలసీని మరింత పటిష్టం చేసుకుంటామని వెల్లడించారు. అసోం గణనీయ ప్రగతికి ప్రధాని మోడీ అపారంగా కట్టుబడి ఉన్నారని , ఈ దిశలోనే జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా) సహాయక ప్రాజెక్టులు అనేకం అసోంలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు. దేశ అంతర్జాతీయ పాలసీలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఆరంభం అయిన పలు ప్రాజెక్టుల క్రమంలో గ్రహించవచ్చునని విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ ప్రాంతపు రాష్ట్రాల అభివృద్థికి కేంద్రం కట్టుబడి ఉందని, అంతర్జాతీయ విధానాలు, భాగస్వామ్యాలు అన్ని కూడా ఈశాన్య భారత ప్రగతి కోణంలోనే సాగుతాయని స్పష్టం చేశారు. జపాన్ రాయబారి సతోషి సుజుకీతో కలిసి ఇక్కడికి వచ్చిన విదేశాంగ మంత్రి జికా సహాయ పథకాల అమలును సుజుకీతో కలిసి సమీక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News