Wednesday, December 4, 2024

నిబంధనలు పాటించని స్పెషల్ స్కూల్స్ పై చర్య తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

నాణ్యత లేని వినికిడి మిషన్స్ విక్రహిస్తున్న క్లినిక్స్ మూసి వేయాలి
వికలాంగుల పునరావాస కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
ఆర్‌పిడబ్లుడి రాష్ట్ర కమిషనర్ కు ఎన్‌పిఆర్‌డి పిర్యాదు

మన తెలంగాణ / హైదరాబాద్ : రెహబిలిటేషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఆర్‌సిఐ) నిబంధనలు పాటించని స్పెషల్ స్కూల్స్, అంటిజం, స్పీచ్, హియరింగ్ థెరపి సెంటర్‌లపై చర్య తీసుకోవాలని ఎన్‌పిఆర్‌డి డిమాండ్ చేసింది. ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర కమిటి సభ్యురాలు పి శశికళతో కూడిన ప్రతినిధి బృందం మలక్‌పేట లోని కార్యాలయంలో గురువారం రాష్ట్ర కమిషనర్ బి శైలజను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో పుట్టగొడుగుల్లా స్పెషల్ స్కూల్స్, అంటీజం, స్పీచ్, హియరింగ్ క్లినిక్స్ పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఆర్‌సిఐ నిబంధనలను ఎక్కడ కూడా పాటించడం లేదన్నారు. ఆర్‌సిఐ సర్టిఫైడ్ చేసిన సిబ్బందినే నియమించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అలాంటి నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. ఆర్‌సిఐ ఆమోదం లేకుండా చేసిన డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులు ఆర్‌సిఐ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.

ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ డిగ్రీ, ఆర్‌సిఐ రిజిస్ట్రేషన్ లాంటి అర్హతలు లేకుండా రాష్ట్రంలో నడుస్తున్న స్పీచ్ థెరపీ క్లినిక్‌లు, రీహాబిలిటేషన్ కేంద్రాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క థెరపీకి నెలకు రూ. 30 వేల నుండి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. సర్టిఫైడ్ తెరపిస్తులు లేకున్నా అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులను నియంత్రిస్తూ ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్ని క్లినిక్స్ ప్రాంచైజ్‌ల పేరుతో వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. నాణ్యమైన సేవలు అందించకుండా ప్రాంచైజ్‌ల పేరుతో వ్యాపారం చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. వికలాంగుల పునరావాస కేంద్రాల పేరుతో వ్యాపారం చేస్తున్నారని,పేరుకే పునరావాసమని, వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత లేకున్నా క్లినిక్స్ నడుపుతూ పిల్లలకు స్పీచ్ థెరపీ,వినికిడి పరీక్షలు చేసి, నాణ్యత లేని వినికిడి మిషన్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వినికిడి పరికరాలు తయారు చేస్తున్న సంస్థలతో కుమ్మక్కై కమిషన్స్ కోసం రాయితీలు ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

స్పెషల్ స్కూల్స్, అంటీజం, స్పీచ్, హియరింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా వికలాంగులకు యాక్సెస్ ఉండడం లేదని,2,3,4 అంతస్థుల్లో, ఆపార్ట్‌మెంట్స్, షాపింగ్ కంప్లెక్సుల్లో నడిపిస్తున్నారని తెలిపారు. ఆర్‌సిఐ నిబంధనల ప్రకారం బిల్డింగ్స్, స్టాఫ్ ఉండాలని డిమాండ్ చేశారు. స్పెషల్ స్కూల్స్, స్పీచ్, హియరింగ్, అంటీజం కేంద్రాలపై ప్రభుత్వం తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్ల ఇష్టనూసారంగా వ్యవహారిస్తున్నరాని అన్నారు. చట్ట ప్రకారం వికలాంగుల కోసం పని చేస్తున్న ప్రతి సంస్థ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్‌సిఐ నిబంధనలు పాటించని స్పెషల్ స్కూల్స్, అంటీజం, స్పీచ్, హియరింగ్ సెంటర్స్ పై చర్య తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడ్తామని హెరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News